Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
పట్టుదల, వత్తి పట్ల అంకితభావంతో ఎదిగిన శోభన్ బాబు క్రమశిక్షణకు మారుపేరు అని రాష్ట్ర శాసనసభ తొలి సభాపతి ఎస్. మధుసూదనాచారి అన్నారు. శ్రీత్యాగరాయ గానసభ ప్రధాన మందిరంలో శతిలయ ఆర్ట్స్ అకాడమీ నిర్వహణలో సీల్వెల్ కార్పొరేషన్ బండారు సుబ్బారావు, అమ్మాని ఫౌండషన్ అమ్మాని సౌజన్యంతో నాటి సినీ నటుడు శోభన్ బాబు 86వ జయంతి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని ఆమని సహా గాయకులు సుభాష్, రాజన్ ఫాల్గుణ, పవన్, శ్రావణి, శ్రీనివాస్ లతో కలిసి ఉదయం 12 ఘంటలు నుంచి నిరాటంకంగా పది ఘంటలు శోభన్ బాబు నటించిన చిత్రాల్లోని పాటలను రస భరితంగా ఆలపించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో మాట్లాడుతూ ఎస్. మధుసూదనాచారి శోభన్ బాబు చిత్రాలు కుటుంబ సమేతంగా చూడ తగ్గవని అసభ్యత హింస ఉండవని వివరించారు. ఆమని బందం పాడిన పాటలు ఆహ్లద పరిచాయని అభినందించారు. సంఖ్యా శాస్త్రవేత్త దైవజ్ఞ శర్మ అధ్యక్షత వహించిన సభలో శోభన్ బాబు అభిమాన సంఘం నాయకులు సుధాకర్ బాబు, రామకష్ణ, పద్మారావు పాల్గొన్నారు.