Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం గాజులరామారం డివిజన్ పరిధిలోని చంద్రగిరినగర్‌లో రూ.49.80 లక్షలతో, అంబేద్కర్‌నగర్‌లో రూ.45.40 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి కాలనీని అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు విజరురామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నవాబ్, నాయకులు ఇంద్రసేనగుప్త, కస్తూరి బాలరాజు, రషీద్ బేగ్, పరుష శ్రీనివాస్ యాదవ్, ఆబిద్, అజరు ప్రసాద్‌గుప్త, సుంకరి చందు ముదిరాజ్, ఇబ్రహీంఖాన్, ఇమ్రాన్బేగ్, చెట్ల వెంకటేష్, మహిళా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, తారాసింగ్, హమీద్, సంతోష్; రాజాబాయి, జహంగీర్‌ఖాన్, ఇస్మాయిల్, బిలాల్, వెంకట్, ఖాదర్, మోహిన్, యూసుఫ్, మాజీద్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమానికి కృషి
కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడు ముందుండి ఆదుకుంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీడిమెట్ల పారిశామ్రికవాడలోని సూపర్ మాక్స్ పర్సనల్ కేర్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు యూనియన్ స్థాపించి 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం కార్మికుల సమస్యలను యజమాన్యంతో చర్చించి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జి.సురేష్‌రెడ్డి, యూనియన్ సభ్యులు లక్ష్మారెడ్డి, సురేష్‌బాబు, భరద్వాజ, ఈశ్వర్‌రెడ్డి, రామ్చందర్రెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.