Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
నవతెలంగాణ-బాలానగర్
ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు అభినందనీయమని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అన్నారు. గురువారం కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్లోని జీహెచ్ఎంసీ రిసోర్స్ సిబ్బందికి హైజీన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్, ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ వంటివి వైరస్ ప్రభావంతో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సీఓ మహిపాల్ రెడ్డి, రిసోర్స్ సిబ్బంది లక్ష్మి, సీహెచ్ నిర్మల, డి.అరుణ, కె రేణుక, ఎ. అలివేలు, రాజేశ్వరి, శ్రవంతి, భవాని, ప్రీతి పాల్గొన్నారు.