Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ డిపార్ట్మెంట్ ఆఫ్ లా చరిత్రలో మొదటిసారిగా న్యాయశాస్త్రంలో పరిశోధన చేస్తున్న విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఈ నెల 22న డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోని సెంటినరీ సెమినార్ హాల్లో 'డీన్ అవార్డు 2022'ను ప్రదానం చేయనున్నట్లు ఓయూ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. గూగుల్ మీట్ ద్వారా గురువారం జరిగిన అవార్డు కమిటీ మీటింగ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగురు స్కాలర్షిప్ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోగా అవార్డు కమిటీ మూడు దశల్లో స్క్రూటినీ చేసిందని చెప్పారు. ఈనెల 22న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ చంద్రయ్య, ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి, కీలక ఉపన్యాసకులుగా నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ శ్రీకష్ణదేవరాయ, ప్రత్యేక ఆహ్వానితులుగా ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి మల్లేశం హాజరవుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో పోస్ట్ డాక్టోరల్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, డాక్టరు ఫెలోషిప్, రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీతలకు డీన్ ప్రశంసాపత్రం ప్రదానం చేస్తున్నట్లు తెలియజేశారు. సమావేశంలో హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, లీగల్ సెల్ డైరెక్టర్ డాక్టర్ రాంప్రసాద్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.