Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలనీ, త్వరగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి అన్నారు. శుక్రవారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను మేయర్ కార్పొరేటర్లు, అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్ పేట్ మీదుగా నాదర్ గుల్ వరకు దాదాపు రూ.20కోట్లతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు సుర్ణగంటి అర్జున్, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, డీఈఈ అశోక్ రెడ్డి, ఏఈఈ బిక్కు నాయక్, మాజీ ఎంపీటీసీ పెద్దబావి ఆనంద్ రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.