Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని విద్యుత్ అధికారులతో కలిసి విద్యుత్ సమస్యలపై స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. గురువారం రాత్రి విద్యుత్ అధికారులు ఏడీఈ యాదగిరి, లైన్ మెన్స్ మల్లేష్, స్వామి, రాజేందర్, జానీ, వెంకటేష్‌తో కలిసి కార్పొరేటర్ మల్కాజిగిరి డివిజన్లోని పలు కాలనీల్లో పాడైపోయిన విద్యుత్ పోల్స్, ట్రాన్స్ ఫార్మర్పె ఫెన్సింగ్, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్, తదితర సమస్యలు, సమస్యాత్మకంగా ఉన్న పోల్స్, ట్రాన్స్ ఫార్మర్స్‌ను అధికారులకు చూపించారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సాయంతో సమస్యాత్మకంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించారు. ఈ కార్యక్రమంలో శరత్, నందు, సంతోష్, శివానంద్, వినోద్ యాదవ్, సునీల్ యాదవ్, అభిషేక్, వేణ, తదితరులు పాల్గొన్నారు.