Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
బడ్జెట్ స్కూళ్లను పరిరక్షించాలనీ, ఆన్లైన్ పేరుతో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలని మండల విధ్యాదికారి హీర్యా నాయక్‌ను ఏఐఎస్ఎఫ్ నాయకులు శుక్రవారం వినతిపత్రం అంద జేశారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ మండల పరిధిలోని సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్లు చాలా ఇబ్బందులు పడుతున్నాయనీ, జనవరి మొత్తం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులకు సరైన విద్యాభోదన అందించలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం స్కూళ్లను పునప్రారంభించడంతో పాటు ప్రవేటు ఉపాధ్యా యులకు కొంత ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి మహేందర్, వెంకటేశ్, లాజర్, శివకుమార్ పాల్గొన్నారు.