Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
తాను గెలిచినప్పటి నుంచి ఎన్నికల ఎజెండాలో లేని సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్యెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హయత్నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి అన్నారు. ఈ మేరకు వారు శక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎల్బీనగర్లో గెలిచిన 11 మంది కార్పొరేటర్లు ప్రజల్లో లేకుండా ఇండ్లలో ఉంటు న్నారనీ, అలాంటి వారిని ప్రజల కోసం పనిచేసే విధంగా చూసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డికి సూచించారు. గతంలో ఎవరూ చేయని పనిని ఒక ఎల్బీ నగర్ ఎమ్యెల్యే మాత్రమే రెవెన్యూ యాక్ట్ 22ఏ ప్రకారం ఎన్నో ఏండ్లుగా ఉన్న భూ సమస్యలను సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఒక్క రూపాయి కూడా ప్రజల కు భారం లేకుండా కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేయని పనిని ఎమ్యేల్యే చేస్తున్నారన్నారు. ఇంత చేస్తున్న ఎమ్మెల్యే ను గౌరవించకపోవడం సరికాదన్నారు. పదో తరగతి చదివిన బీజేపీ అధ్యక్షుడికి రెవెన్యూపై అవగాహన లేదనీ, అలాంటి వ్యక్తి మాట్లాడటం హాస్యాస్పందగా ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు దమ్ము, దైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. సమా వేశంలో భాస్కర్ సాగర్, మల్లేష్, మల్లీశ్వరీరెడ్డి, నాగేష్, రాజు, గోవర్ధన్, కృష్ణారెడ్డి, శ్రీరాములు, సమ్మయ్య, స్కైలాబ్, ప్రసన్న, రఫీ, కోట రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.