Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఖమర్ అహ్మద్ హెచ్చరించారు. శుక్రవారం పెద్ద అంబర్పేట మున్సిపల్ నాలుగో వార్డులోని సర్వే నెంబర్ 228, 229, 230, 231 లలో అనుమతులు లేకుండా చేపట్టిన షెడ్లు, 13వ వార్డులో సర్వే నెం.78లో ప్రహరీ గోడను హెచ్ఎండీఏ ఎన్పోర్స్మెంట్ సాయంతో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ ఏపీఓ వసుంధర, టీపీఓ శ్రీకాంత్, మేనేజర్ చంద్రశేఖర్, హెచ్ఎండీఏ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.