Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-తుర్కయాంజల్
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేస్తామని డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య దీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రాగన్నగూడ పరిధిలోని జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి చెందిన దాదాపు 30 మంది కాంగెస్ కార్యకర్తలు 7వ వార్డు అధ్యక్షుడు రొక్కం ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సహ కార బ్యాంకు డైరెక్టర్ సామ సంజీవరెడ్డి సమక్షంలో టీఆర్ ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి సత్తయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మకత్ లాల్, జవహర్ లాల్, కొర్ర గణేష్, శ్రీరామ్, గోవర్ధన్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కందాడ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ చెరుకు రఘునాధ్గౌడ్, బాలక్రిష్ణారెడ్డి, హరి కృష్ణారెడ్డి, కొర్ర శంకర్, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.