Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్ అన్నారు. గౌతంనగర్ డివిజన్ పరిధిలోని స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, పూర్తిస్థాయిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో నిరంతరం ప్రజల పక్షాన ముందుంటామని తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. హిల్ టాప్ కాలనీలోకి వెళ్లే మెయిన్ రోడ్డుపై మ్యాన్ హౌల్ లీకై డ్రయినేజీ మురు గునీరు రోడ్డుపై పారుతున్న విషయం తమ దృష్టికి రాలేదనీ, వస్తే వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునే వారిమి అని పేర్కొన్నారు. డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరించామని తెలిపారు. తాము ఈ సంవత్సర కాలంలో అనేక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. డివిజన్లో ఇప్పటికే సీసీ రోడ్లు, బాక్స్ డ్రైన్, డ్రయినేజీ, పెండింగ్లో ఉన్న వాటర్ వర్క్స్ పనులు, స్ట్రీట్ లైట్స్, పారిశుధ్యం, కమ్యూనిటీ హాల్స్ తదితర సమస్యలను ప్రజలకు అవసర మైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశామని తెలిపారు. డివిజన్లోని కాలనీలు, బస్తీల్లో ఉన్న స్థానికులకు ఏ సమస్యలు ఉన్నా తనకు గానీ, కాలనీలో ఉన్న టీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకొస్తే విషయాన్ని సంబంధిత అధికారులకు చెప్పి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలిపారు.