Authorization
Wed March 19, 2025 09:23:34 pm
నవతెలంగాణ-హస్తినాపురం
భారతీయ తకమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర మూడో మహాసభను జయప్రదం చేయాలని హస్తినాపురం డివిజన్ నందనవనంలో వాల్ పోస్టర్ను స్థానిక పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ఎల్బీనగర్ సర్కిల్ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 23-25 వరకు తుర్కయాంజల్లో జరిగే రాష్ట్ర మహాసభల్లో ప్రజల సమస్యలపై చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల పని తీరుపై భవిష్యత్ పోరాటాలకు ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నేటి సాయ ంత్రం 4 గంటలకు ఆన్లైన్లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్ర మంలో ఎల్బీనగర్ సర్కిల్ కమిటీ కార్యదర్శి ఆలేటి ఎల్ల య్య, కమిటీ సభ్యులు ఆర్.పాండు నాయక్, దుర్గారావు, మంథని యాదయ్య, షకీమ్మ, తదితరులు పాల్గొన్నారు.