Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామనీ, సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి ఎన్ని కోట్ల నిధులైనా ఖర్చు చేసేందుకు వెనుకాడబోమని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్‌తో కలిసి నియోజకవర్గ పరిధిలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, హార్టికల్చర్ తదితర శాఖల ఆధ్వ ర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.9.60 కోట్ల విలువైన అభివృద్ధి పనులు నిర్మాణం పూర్తయి ప్రారంభా నికి సిద్దంగా ఉన్నాయన్నారు. ఈ నెల 25వ తేదీ నుంరచి డివిజన్ల వారీగా ఆయా అభివృద్ధి పనులను ప్రారంభించ నున్నట్టు వివరించారు. సుమారు రూ.35 కోట్లతో నూతన పనుల కోసం ప్రతిపాదనలను రూపొందించి నిధుల మంజూరు కోసం పంపించినట్టు తెలిపారు. ప్రజల సమ స్యలను పరిష్కరించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారుల పర్యవేక్షణ సక్ర మంగా లేని కారణంగానే పనుల్లో జాప్యం జరుగుతుంద న్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రధాన రహదారుల అభి వృద్ధి జరుగుతుందనీ, అంతర్గత రహదారుల అభివృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏండ్ల క్రితం వేసిన సీవరేజ్, మంచినీటి పైప్‌ల వల్ల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొం టున్నట్టు ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. వాటి పరిష్కా రానికి గాను నూతన పైప్ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే కొన్ని చోట్ల నూతన పైప్ లైన్ల ఏర్పాటుతో సమస్యలను పరిష్కరించామనీ, మిగిలిన ప్రాంతాల్లో కూడా పరిష్కారానికి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు చెప్పారు. సనత్‌నగర్ డివిజన్లోని శ్యామల కుంటలో గల కంజర్ల లక్ష్మీనారాయణ పార్క్‌కు వచ్చే వారి కోసం అన్ని వసతులను కల్పిస్తూ ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. పార్క్‌లోని నీటి కొలనులో ఫెడల్ బోట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సనత్‌నగర్ డివిజన్లో అత్యధికంగా 55 పార్క్‌లు ఉన్నాయయనీ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మోడల్ ప్రాజెక్ట్‌గా చేపట్టి పార్క్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వసంత, వాటర్ వర్క్స్ కృష్ణ, నార్త్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్, హార్టికల్చర్ శ్రీనివాస్, ట్రాన్స్ కో చంద్రశేఖర్, శ్రీధర్, టౌన్ ప్లానింగ్ క్రిస్టోఫర్, భార్గవ్ పాల్గొన్నారు.