Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సంస్కృతి టౌన్ షిప్ సెక్యూరిటీ గేట్ల కూల్చివేతపై టౌన్షిప్ వాసుల ఫిర్యాదుతో అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యామ్సన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రిజినల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీటీసీపీ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యభామ శుక్రవారం సందర్శించి స్థానికులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సంస్కృతి టౌన్ షిప్ నుంచి పోచారం లింక్ రోడ్డు వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పోచారం గ్రామస్తులు, మాజీ ఎంపీటీసి చెరుకు బద్రినారయణ గౌడ్, టౌన్ షిప్ సీనియర్ సిటిజన్స్ ఇరువురు కోర్టును ఆశ్రయించగా సోమవారం గ్రామస్తులకు, బద్రినారాయణ గౌడ్‌కు అనుకులాంగా తీర్పువచ్చింది. మంగళవారం మున్సిపాలిటీ కమిషనర్ సురేష్ జేసీబీ సహాయంతో టౌన్ షిప్ చుట్టు ఉన్న సెక్యూరిటీ గెట్లను తొలిగించారు. దీనిపై టౌన్ షిప్ వాసులు కమిషనర్ ఏకపక్షంగా వ్యవహారించారని మీడియా ద్వారా ఆరోపించడంతో పాటు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు, అధికారులకు పిర్యాదులు చేయడంతో స్పందించిన అధికారులు కూల్చివేసిన సెక్యూరిటీ గెట్లను పరిశీలించి, పలు రికార్డులను పరిశీలించి ఇరువర్గాల వాదనలు విన్నారు. ఇరువర్గాలకు న్యాయం జరిగేవిధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, కమిషనర్ సురేష్, కౌన్సిలర్లు మెట్టు బాల్‌రెడ్డి, బెజ్జంకి హరిప్రసాద్ రావు, మేనేజర్ నర్సింలు, టౌన్షిప్ అసోసియేషన సభ్యులు, సీనియర్ సిటిజన్స్, తదితరులు పాల్గొన్నారు.