Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేట్ శ్రీ బునిల సమేతి రంగనాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలో త్రీ స్టార్ రాజా క్రియేషన్స్ పతాకంపై స్థానిక కౌన్సిలర్ చింతల రాజశేఖర్ నిర్మాతగా ప్రవీన్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న చిత్రాన్ని శుక్రవారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. రాజశేఖర్ తనయుడు చింతల రాజేష్ హీరో, హీరోయినిగా సురేఖ రాథోడ్ నటిస్తున్న ఈ చిత్రానికి మున్సిపాలిటీ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ బోయపల్లి సత్తి రెడ్డి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా నిర్మాత, స్థానిక కౌన్సిలర్ చింతల రాజశేఖర్ మాట్లాడుతూ ఈ సినిమాను మంచి కథాంశంతో తెరపైకి తేవడం జరుగుతుందని, 20ఏండ్లుగా దర్శకత్వం కోసం ఎదిరిచేస్తున్న ప్రవీన్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరపైకి వస్తుందని, అందరి అభిమానం చూరగొని గొప్ప విజయం సాధించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్ ఫిబ్రవరి మొదటి వారం నుంచి రెగ్యులర్గా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పోచారం మున్సిపాలిటీ చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, కమిషనర్ సురేష్, కౌన్సిలర్లు గొంగళ్ళ మహేష్, సింగిరెడ్డి సాయిరెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శేఖర్, ఆలయ కమిటీ చైర్మెన్ రాజేష్ గౌడ్, డైరెక్టర్ సగ్గు రవిందర్, మాజీ ఎంపీటీసీ నర్రి శ్రీశైలం, నాయకులు నర్రి కాశయ్య, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, జితేందర్ నాయక్, అబ్బవతి నర్సింహ్మ, శ్రీహరి, పద్మారావు, తదితరులు పాల్గొన్నారు.