Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విజేతలకు బహుమతులు అందజేసిన సర్పంచ్ స్వప్న
నవతెలంగాణ-బూర్గంపాడు
స్నేహితుని జ్ఞాపకార్ధంగా బూర్గంపాడులో గత కొన్ని సంవత్సరాలుగా యూసుఫ్ క్రికెట్ టోర్నమెంట్ను యూసుఫ్ స్నేహితులు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఫైనల్లో జరిగిన పోటీల్లో పాల్వంచ జట్టు విజేతగా నిలిచింది. రన్నర గా కొత్తగూడెం జట్టు నిలిచింది. బూర్గంపాడులోని జక్కం పెద్ద బుచ్చయ్య మెమోరియల్ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన ఈ పోటీలో నువ్వా నేనా అన్నట్టు విజయం వైపు దూసుకెళ్లేందుకు హౌరా హౌరీగా సాగిన ఫైనల్లో కొత్తగూడెం, పాల్వంచ జట్ల మధ్య సాగింది. జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన రచ్చమ్యాన్ ఎలెవన్ పాల్వంచ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 4 విక్కెట్లు కోల్పోయి 144 భారీ పరుగులు చేసింది. అనంతరం 145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎలెవన్ స్టార్స్ కొత్తగూడెం జట్టు 10 ఓవర్లలో 68 పరుగులకి ఆల్ ఔట్ అయి ఓటమి చవిచూసింది. పాల్వంచ జట్టులోని బ్యాట్మాన్ బాల 33 పరుగులు చేసి బౌలింగ్లో 2 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఈ బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బూర్గంపాడు సర్పంచ్ సిరిపురపు స్వప్న పాల్గొని ప్రసంగించారు. మిత్రుడు పేరుమీద బూర్గంపాడులో క్రికెట్ పోటీలు 14 సంవత్సరాలకు నిర్వహించడం అభినందనీయమని ఆమె అన్నారు. విజేతగా నిలిచిన పాల్వంచ జట్టుకు రూ.25000 వేలు నగదుతోపాటు ట్రోఫీని, ద్వితీయ స్థానంలో నిలిచిన కొత్తగూడెం జట్టుకు రూ.12,500 వేలు నగదుతోపాటు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నీ స్పాన్సర్ స్వేరోస్ జిల్లా నాయకులు గోర్ల వీరబాబు, బొల్లు రవి, సాబీర్ హుస్సేన్, గుండె వెంకన్న, నజీర్రుద్దీన్, నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కమీటీ సోహైల్ పాషా, గోనెల నాని అబ్దుల్ సలీమ్, భజన సతీష్, సారధి, అబ్దుల్ నయీమ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టోర్నీ మాన్ అఫ్ ది సిరీస్ భరత్ (ఎలెవన్ స్టార్స్ కొత్తగూడెం) బెస్ట్ బ్యాట్మాన్ మధు (ఎలెవన్ స్టార్స్, కొత్తగూడెం) అందజేశారు. అలాగేబెస్ట్ బౌలర్ భరత్ (ఎలెవన్ స్టార్స్, కొత్తగూడెం)
బెస్ట్ కీపర్ కార్తీక్(రచ్చమ్యాన్ ఎలెవన్, పాల్వంచ), బెస్ట్ ఫీల్డర్ అశు (రచ్చమ్యాన్ ఎలెవన్, పాల్వంచ)లకు అందజేశారు. బెస్ట్ ఆల్ రౌండర్ బాల (రచ్చమ్యాన్ ఎలెవన్, పాల్వంచ)లకు మెమొంటోలను అందజేశారు.