Authorization
Fri March 21, 2025 01:56:47 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో తెలుగు యువత తెలంగాణ అధికార ప్రతినిధి చింతల నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 39వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. నరేష్ కుమార్ మాట్లాడుతూ నారా లోకేష్ రానున్న రోజుల్లో ఉన్నతమైన పదవులు అధిరోహించాలనీ, మరింత మంది పేదలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌతంనగర్ డివిజన్ అధ్యక్షులు, మాజీ సైనికులు పితాని సత్యనారాయణ, గౌతంనగర్ డివిజన్ కంటస్టెంట్ కార్పొరేటర్ చింతల అంజమ్మ ముదిరాజ్, తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పలకల చంద్ర, సాయి కిరణ్, బొమ్మ భానుచందర్, మిట్టపల్లి రమేష్, రామిశెట్టి సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.