Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
చిలకలగూడ సీఎస్ పరిధిలోని ఏకశిలా మెడికల్ హాల్ వద్ద సంతోష్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసును చేధించినట్టు అడిషనల్ కమిషనర్ చౌహాన్ తెలిపారు. ఆదివారం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో నవాజ్, షేక్ సబీర్, షరీఫ్ ఖాన్‌ను అరెస్ట్ చేశామనీ, పాత కక్షల నేపథ్యంలో సంతోష్, నవాజ్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం చెలరేగింది. నాలుగేండ్లుగా ఇద్దరికీ పరిచయం ఉంది. నిందితుడు నవాజ్ కొన్నేండ్ల క్రితం పిల్లలను కొడుతున్న సమయంలో సంతోష్ నవాజ్ ను ప్రశ్నించారు. దీంతో సంతోష్ పై కక్ష పెంచుకున్న నవాజ్ ఈ నెల 22వ తేదీన సంతోష్‌తో ఆటోలో వచ్చి వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలోనే నవాజ్ సంతోష్‌ను కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సంతోష్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. సంతోష్ శరీరంపై కట్యిపొట్లు ఉన్నాయనీ, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపి మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. పోలీసుల దర్యాప్తులో నిందితుదు నవాజ్‌పై గతంలో నల్లకుంట, ముషీరాబాద్ పీఎస్‌లలో కూడా చోరీ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
మరో ఘటనలో..
మరో ఘటనలో రెండు కట్టిపొట్ల కేసులను చేదించినట్టు తెలిపారు. తెల్లవారు జామున 3:30 నిమిషాల సమయంలో బేగంపేట పీఎస్ పరిధిలో రసూల్ పురలో ప్రదీప్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ప్రదీప్ అనే వ్యక్తితో గొడవపడి ఏడుగురు యువకులు ప్రదీప్‌పై కత్తితో దాడికి పాల్పడ్డారు. ప్రదీప్, మునేర్ లా మధ్య మాట మాట పెరగడంతో మూనిర్ ప్రదీప్‌ను కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ప్రదీప్‌తోపాటు అతని స్నేహితుడు హేమంత్ కూడా గాయపడ్డారు. దీంతో హేమంత్ బేగంపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపి ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.