Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకో వాలని కీసర సీఐ రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం నాగారం మున్సిపాలిటీ పరిధిలో గల ఒకటో వార్డు, ఓయూ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా కీసర సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్సై రామసూర్యం, నాగారం మున్సిపల్ వైస్ చైర్మెన్ మల్లేష్ యాదవ్, ఒకటో వార్డు కౌన్సిలర్ సరిత రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది తో సమానం అన్నారు. ఈ కాలనీ ఇతర కాలనీలకు ఆదర్శవంతంగా ఉందని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన కాలనీ అధ్యక్షుడు రామ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లేష్‌ను సీఐ అభినంది ంచారు. కార్యక్రమంలో కాలనీ సభ్యులు జగన్ రెడ్డి, కిరణ్, రాజు రెడ్డి, ఉమేష్, రమేష్, హరి, సంతోష్, హుస్సేన్ రావు, శ్రీనివాస్, రాములు, జగదీశ్వర్, రామ్ భారత, రామచందర్, శ్రీకాంత్, అవినాష్ పాల్గొన్నారు.