Authorization
Wed March 19, 2025 05:55:52 am
నవతెలంగాణ-జవహర్నగర్
పూజల కోసం వచ్చిన తనకు మాయ మాటలు చెప్పి, ఏడేండ్లుగా ప్రేమిస్తున్నాను అని వెంట బడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనీ, తనకు న్యాయం చేయాలని బాధితులురాలు ప్రియుడి ఇంటి ఎదుట ఆదివారం బైటాయించింది. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం సాయి గణేష్ జంధ్యాల అనే వ్యక్తి తనను ఏడేండ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేశాడని ఆరోపించింది. తనకు న్యాయం జరిగేంత వరకు అతని ఇంటి ఎదుట న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు.