Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ముఖేష్ ఛారిటబుల్ ట్రస్టు, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట వారు సంయుక్తంగా పాపిరెడ్డి నగర్ ఆటో స్టాండ్ వద్ద ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్ఎంపీ అసోసియేషన్ వారు సహాయ సహకారాలు అందించారు. ఈ సంద ర్భంగా సుమారు 150 మందికి ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. బీసీ షుగర్ లాంటి పరీక్షలతోపాటు అవసరమైన వారికి వైద్యు లు మందులను అందజేశారు. వైద్య పరీక్షలకు వచ్చిన వారికి ముఖేష్ ఛారిటబుల్ ట్రస్టు తరపున పండ్లు, బిస్కట్ ప్యాకెట్స్, మాస్క్‌లు, శానిటైజర్లు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖేష్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మెన్ డాక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి నెలా 22వ తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన కుమారుని జ్ఞాపకార్థం ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ క్యాంపుల ద్వారా అవసరమైన పేద వారికి ఉచిత వైద్య పరీక్షలు, సేవలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్‌కు చెందిన క్యాంపు నిర్వాహకులు విజయచందర్ మాట్లాడుతూ ఈ ఉచిత శిబిరంలో పాల్గొన్న పేషెంట్లకు ఎవరికైనా మరిన్ని పరీక్షలు అంటే సీటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటివి అవసరమైతే తెల్ల రేషన్ కార్డు గల వారికి ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ముఖేష్ ఛారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ ఎస్.మనీష్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ మౌనిక, సిబ్బంది సిస్టర్ మేరీ జాస్, సిస్టర్ అహన, సిస్టర్ సాయిమ్మ, క్యాంపు మేనేజర్ విజయచేందర్, ప్రకాష్, పారామెడికల్ సిబ్బంది, తెలంగాణ ఆర్ఎంపీ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ పుండరీకం, డాక్టర్ శివశంకర్, డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ వెంకట్, డాక్టర్ గోవింద్ రాజు, డాక్టర్ వివేక్చారి, తదితరులు పాల్గొన్నారు.