Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అంబేద్కర్ ఆశయా సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కీసర మండల అంబేద్కర్ సంఘం నూతన అధ్యక్షుడు మెరుగు రవిందర్ అన్నారు. ఆదివారం కీసర మండల అంబేద్కర్ సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీసర గ్రామానికి చెందిన మెరుగు రవిందర్‌ను సంఘం మండల అధ్యక్షుడుగా, ఉపాధ్యక్షులుగా బంటు శ్రీనివాస్, గంగి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా దాయర శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ముద్దం పెంటేష్, కార్యదర్శిగా బొల్లి వీరేశ్, సహాయ కార్యదర్శులుగా గోరంటి ప్రవీణ్ కుమార్, దాన్నోళ్ల మల్లేష్, కోశాధికారి గోక బాలచారిలను ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం సంఘం మాజీ అధ్యక్షుడు బోడ జంగయ్య నూతన అధ్యక్షుడు మెరుగు రవీందర్‌కి బాధ్యతలు అప్పగించారు. సమావేశం అనంతరం సభ్యులందరూ ర్యాలీగా వెళ్లి బాబాసాహెబ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో కొమ్ము సుదర్శన్, మంచాల పెంటయ్య, బక్కాని నర్సింగ్‌రావు, మంచాల రాజలింగం, శీలం శ్రీనివాస్, చినింగని కృష్ణ, గంగి మల్లేష్, శీలం మల్లేష్, బోడ శ్రీనివాస్, బత్తుల వేణు, కురం రాము, కర్రె గణేష్, తుడుం శ్రీనివాస్, భిక్షపతి, బందెల పరమేష్, చినింగని బాలరాజ్, మెరుగు నవీన్, తదితరులు పాల్గొన్నారు.