Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
180 కిలోల బరువుతో స్థూల కాయంతో కదల్లేని పరిస్థితుల్లో, బైపాస్ యంత్రం మద్దతుతో జీవిస్తున్న సోమాలియా రోగికి జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు మొదటిసారి పూర్తి రోబోటిక్ బేరియాట్రిక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోబోటిక్ సర్జరీ నిపుణులు డాక్టర్ శివ శరణ్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ బృందం ఈ మేరకు వివరాలను వెల్లడించారు. సోమాలియాకు చెందిన 40 ఏండ్ల హిబిబో అబ్దుల్లే మహమ్మద్ అనే మహిళ అధిక బరువుతో అపోలో హాస్పటల్‌కు వచ్చారు. ఆమెకు అన్ని పరీక్షలు నిర్వహించి రోబోటిక్ సర్జరీని మూడు గంటల పాటు శ్రమించి విజయవంతంగా నిర్వహించారు. అనంతరం రోగిని రెండో డిచార్జి చేశారు. రెండు వారాల తర్వాత ఆమె పూర్తిగా కోలుకుని ఎలాంటి అసౌకర్యం లేకుండా నడవగలుగుతుందని తెలిపారు.