Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కుషాయిగూడ సమీపంలోని సాయి నగర్ ప్రధాన రహదారిపై 60 గజాల్లో ఇంటి నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారులు రాత్రికి రాత్రే అనుమతులు జారీ చేశారు. వాటి స్థానంలో కమర్షియల్ భవనాన్ని నిర్మిస్తున్నా పట్టించుకో వడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి అండదండలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల ను అరికట్టాలని ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ టీఎస్ఈ పాస్ సిస్టం ద్వారా అనుమతులను జారీ చేయాలని ఆదేశిస్తే అధికార పార్టీ నాయకులు తమ పలుకుబడిని ఉపయో గించి అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భారీ ఎత్తున అవినీతి, అక్రమా లు జరిగాయని ప్రతిపక్ష పార్టీ లు, కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాప్రా టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయమై కాప్రా ఏఏసీ శ్రీధర్ ప్రసాద్‌ను వివరణ కోరగా టీఎస్ఈ పాస్ ద్వారా అనుమతి తీసుకున్నారనీ, తాము ఏమీ చేయలేమని తెలిపారు.