Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
భవన నిర్మాణ కార్మికులకు లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సంక్షేమ కార్డులు పని చేయటం లేదనీ, సంక్షేమ పథకాలు వారికి అందడం లేదని సీఐటీయూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మోతీనగర్ లేబర్ అడ్డా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో హైదరాబాద్ నగర నాయకులు పుల్లారావు, స్థానిక ప్రజా సంఘాల నాయ కులు సాయి శేషగిరిరావు మాట్లాడారు. మోతీనగర్ అడ్డా వద్ద 800 మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారనీ, అందులో 8 మంది కార్మికులు చనిపోతే రెండేండ్ల నుంచి లేబర్ ఆఫీసర్లు వారి ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నార న్నారు. వారికి రావాల్సిన ఆర్థిక సాయం మంజూరు చేయ డంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనీ, అలాంటి లేబర్ ఆఫీ సర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల కోసం ప్రభుత్వాలు పని చేయటం లేదనీ, మోతీనగర్ లేబర్ అడ్డా వద్ద వారికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి లేబర్ అడ్డా వద్ద మరుగుదొడ్లు, కార్మికులు కూర్చోవడానికి షెడ్డు నిర్మించాలనీ, రేషన్ కార్డు లేని వారికి వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలనీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈనెల 26వ తేదీన జరిగే రిపబ్లిక్ డే జెండా వందనంలో కార్మికులు అందరూ పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు విష్ణు, బాలు, ఆంజనేయులు, శంకర్, రమేష్, లక్ష్మణ్, కాశన్న, ఎల్లేష్, మహమూద్, నరేందర్, అబ్బాస్, సత్యమ్మ, నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు.