Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
సుందరయ్య పార్కు అభివృద్ధికి కృషి చేస్తానని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం సుందరయ్య పార్క్‌లో వాకర్స్ క్లబ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్క్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, రామ్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కె.రవి చారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం కాపాడుకోవడానికి నడక, వ్యాయామం ఎంతో అవసరం అన్నారు. సుందరయ్య పార్క్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి పార్కులో ఓపెన్ జిమ్, టాయిలెట్ల నిర్మాణం, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పి పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడిగా ఎన్.పాండయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆర్.సంతోష్ గౌడ్, కోశాధికారిగా ఎస్.రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎంఎన్ఆర్. రావు, టి.రితేష్, బొల్లి స్వామి, లీగల్ అడ్వైజర్‌గా రాజా విశ్వనాధ్, సహాయ కార్యదర్శిగా కళ్యాణ్ నాయక్, శ్రీదేవి, కీర్తితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హౌస్ ఫెడ్ డైరెక్టర్ ఎ.కిషన్ రావు, టీఆర్ఎస్ యువనేత ముఠా జై సింహ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు రావుల, మోజెస్, సీనియర్ నాయకులు సిరిగిరి కిరణ్, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, మన్నె దామోదర్ రెడ్డి, ఆర్.వివేక్, ఎర్రం శేఖర్, తదితరులు పాల్గొన్నారు.