Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్ ఇందిరా నగర్లో రూ.6 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం స్ధానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, డ్రయినేజీ, తాగునీటి వ్యవస్థ ఆధునికీకరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. నియోజక వర్గంలో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కా రానికి నిధులు మంజూరు చేసి పనులను పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, కాంట్రాక్టర్ రమావత్ పాండు, బస్తీ వాసులు రాములు, లక్ష్మణ్, వెంకటేశ్, జనార్దన్, సుజాత, టీఆర్ఎస్ నాయకులు కొమ్ము శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భూపతి లక్ష్మణ్, నాయకులు ఆర్.కె.బాబు, రాము, లింగంగౌడ్, బుచ్చిరెడ్డి, జనార్దన్, శేఖర్, దేవేందర్, నర్సింగ్‌యాదవ్, మధు, దేవి, శ్రీను, ప్రభాకర్, చారి, సురేష్‌గౌడ్, రాజేష్, మల్లేష్‌గౌడ్, ఉమేష్, వెంకటేష్, సతీష్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.