Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
రాష్ట్రంలో కరోనా కరోనా పెరుగుతుందనే సాకుతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం సరికాదనీ, జీవో 4ను వెంటనే రద్దు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డీవైఎఫ్ఐ) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా పేరుతో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడం అంటే విద్యార్ధుల భవిష్యత్‌ను నాశం చేయడమే అని డీవైఎఫ్ఐ భావిస్తుందని తెలిపారు. ప్రపం చం ఎక్కువ కేసులు వస్తున్న దేశాల్లో కూడా విద్యాసంస్థలు మూసివేయలేదనీ, కొన్ని రాష్ట్రాల్లో కూడా నడుస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అనుమతించ కపోవడం ఆక్షేపణీయమని తెలిపారు. ఆన్ లైన్ చదువులు అంటే సామాజి కంగా, ఆర్ధికంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. లాప్ ట్యాఫ్స్, ట్యాబ్, స్మార్ట్ ఫోన్స్ కొనలేని పరిస్థితి ఉందని తెలిపారు. ఆన్ లైన్ చదువులు ఎలాంటి పరిస్థితిలోనైనా నష్టదాయకమని తెలిపారు ప్రజా రవాణా వ్యవస్థ, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, రెస్టారెంట్లు, వైన్ షాపులు, రాజకీయ పార్టీల ర్యాలీలు, పండుగలకు లేని ఆంక్షలు విద్యార్దులకు పెట్టడం అంటే ఒక తరం నష్టపోవడమే అని తెలిపారు. ప్రభుత్వం అన్ని విద్యాసంస్థల్లో వ్యాక్సిన్ కేంద్రా లను ఏర్పాటు చేయాలనీ, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న విద్యాసంస్థల్లో షిప్ట్ పద్ధతుల్లో ఉదయం, సాయంత్రం తరగతులు నిర్వహించాలనీ, ప్రతి హైస్కూ లు, జూనియర్, డిగ్రీ కళాశాలలో శానిటేషన్ కోసం ప్రత్యేక నిధులు కేటాయిం చాలనీ, ఆన్లైన్ చదువుల కోసం ప్రభుత్వం ఉచిత వైఫై జోన్లు ఏర్పాటు చేయా లనీ, ప్రభుత్వమే ఉచితంగా ఇంటర్నట్ గల సిమ్, ట్యాబ్ ఇవ్వాలని కోరారు.