Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో గౌడ సంఘం అధ్యక్షుడు ఎలిజాల శ్రీశైలం గౌడ్, ఎలిజాల మహేష్ గౌడ్, గండి శ్రీధర్ గౌడ్, ఎలిజాల సందీప్ గౌడ్, విగ్రహ దాతలు ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకో వాలన్నారు. పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు చేసే వారికి తన వంతు సాయంగా రూ.లక్ష అందజేస్తానని హామీ నిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గౌడ సంఘాలకు పెద్ద ఎత్తున ఈత, తాటి వనాలను పెంచుతూ వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కృషి చేస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా విగ్రహదాతను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జాతీయ నాయకులు జై హింద్ గౌడ్, నాగారం మున్సిపల్ వైస్ చైర్మెన్ మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు ఎలిజాల నాగేష్ గౌడ్, పంబల సరిత రమేష్, గోక కళావతి యాదగిరి, గూడూరు సబితా ఆంజనేయులు గౌడ్, గౌడ సంఘం నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.