Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా కారణంగా రెండేండ్లుగా విద్యార్థుల చదువులు నామమాత్రంగానే సాగుతున్నాయి. అందులో ఈ విద్యాసంవత్సరం మూడు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ నుంచి బడుల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమై.. సాఫీగా సాగుతున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు మరోసారి విద్యార్థులు ఆన్లైన్ బాట పట్టాల్సి వచ్చింది. వైరస్ విజృంభణ నేపథ్యంలో సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 30వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడగిస్తూ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులకు అనుమతిస్తుందా? లేదా ఆన్లైన్ బోధన వైపు మొగ్గుచూపుతుందా? అనే సందేహాల నేపథ్యంలో సర్కారు డిజిటల్ బోధన వైపు మొగ్గు చూపింది. ఈ నెల 24వ తేదీ నుంచి 8,9,10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ లో పాఠాలు బోధించాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుం టున్నారు. గతంలో లాగా ప్రస్తుతం కూడా బోధన, బోధనేతర సిబ్బంది రొటేషన్ పద్ధితిలో 50శాతం విధులకు హాజరు కావాలనీ, మిగతా 50శాతం మంది ఇంటి నుంచే ఆన్లైన్ బోధన పర్యవేక్షించనున్నారు.
నేటి నుంచి బోధన షురూ..
ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి పాఠశాలల్లో ఆన్లైన్ బోధన షురూ కానుంది. విద్యార్థులకు టీశాట్, యాదగిరి ద్వారా పాఠాలు చెప్పేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 181 ప్రభుత్వ ఉన్నత, 113 ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. వీటిలో 8,9,10 తరగతుల విద్యార్థులు దాదాపు 40వేలకుపైగా విద్యనభ్యసిస్తున్నారు. కాగా జిల్లాలోని కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలు 1-10వ తరగతి వరకు ఇప్పటికే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి.
వెంటాడుతున్న ఆన్లైన్ కష్టాలు!
కరోనా మొదటి, రెండో దశ నేపథ్యంలో విద్యార్థులు ఆన్లైన్ బోధనకే పరిమితం కావాల్సి న పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలో దినసరి వేతన కుటుంబాలతో పాటు వలస కూలీల పిల్లలే ఎక్కువగా ప్రభుత్వ బడుల్లో చదువుతు న్నారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లుతుండ టంతో పిల్లలు ఇండ్ల వద్ద ఉంటున్నారు. ఇందులో కొందరికి మొబైల్ ఫోన్లు లేకపోవడం, ఉన్నా నెట్ రాకపోవడం, సిగల్స్ సరిగ్గా లేకపో వడం సమస్యగా మారింది. దానికితోడు అప్రకటిత కరెంట్ కోతలతో ఆన్లైన్ బోధన అంతంత మాత్రంగానే సాగింది. ఈసారి మళ్లీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
తరగతుల షెడ్యూల్ ఖరారు..
హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం బోధన, బోధనేతర సిబ్బంది సుమారు ఆరు వేలకుపైనే ఉంటారు. ఆన్లైన్ తరగతుల నేపథ్యంలో నేటి నుంచి 50శాతం మేర బోధన, బోధనేతర సిబ్బ ంది హాజరవుతారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసు లు వింటున్నారా లేదా ఏమైనా సందేహాలు ఉంటే అప్పటికప్పుడే నివృత్తి చేయనున్నారు. విద్యార్థుల తరగతుల నిర్వహణకు సంబం ధించిన షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు ఆదివారం ఖరారు చేశారు.