Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని కార్పొరేషన్స్, మున్సిపాలిటీలోని అనుమతిలేని నిర్మాణాల విషయంలో సీరియస్గా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగానే ఐదు రోజులుగా నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో అక్రమ నిర్మాణాలు గుర్తింపు, వాటి కూల్చివేత పనులు నిరాటం కంగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీల పరిధిలో హెచ్ ఎండీఏ, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అక్రమ భవనాల కూల్చివేత కార్యక్ర మాలను నిర్వహించాయి. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు అక్రమ నిర్మాణాలు, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు, ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో రెండు, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో 13 అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ, డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ టీమ్స్ కూల్చివేత చర్యలు నిర్వహించాయి. గత సోమవారం నుంచి అక్రమ నిర్మాణాలపై దాడుల పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వారం రోజుల్లో 82 అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వాటిలో 66 అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు చేపట్టారు. మరో 16 అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. హెచ్ఎండీఏ, టాస్క్ఫోర్స్ యంత్రాంగం సీజ్ చేసిన వాటిల్లో ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో ఒక రెడీమిక్స్ సిమెంట్ ప్లాంట్, ఒక క్రషర్ ప్లాంట్ ఉన్నాయి. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఒక పెట్రోల్ బంక్ కూడా ఉన్నది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు అక్రమ నిర్మాణా లను కూల్చివేశారు.
అదే నార్సింగి మున్సి పాలిటీ పరిధిలోనే అనధికారిక నిర్మాణంతో ఉన్న రెండు గోదాములను సీజ్ చేశారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో మూడు అక్రమ నిర్మాణాలతోపాటు ఒక అనధికార గోదామును కూడా సీజ్ చేశారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో మూడు అక్రమ నిర్మాణాలను, షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో మూడు అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు చేపట్టారు.