Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ఎలాంటి నోటీసులివ్వకుండా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ సెక్యూ రిటీ గేట్లను మున్సిపల్ అధికారులు అక్రమంగా కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతల యాదయ్య, మండల కార్యదర్శి ఎన్ సబిత అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టౌన్షిప్ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా, భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న గేట్లను తొలగించడం సరికాదన్నారు. సంస్కృతి టౌన్షిప్ వాసులకు ప్రభుత్వం భద్రత కల్పించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని టౌన్షిప్ వాసులకు అండగా ఉంటామని చెప్పారు.