Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ ఉద్యమ నేత, పాలనాదక్షుడు సీఎం కేసీఆర్ అన్నివర్గాలకూ దగ్గరి 'బంధు'వేనని, ఆయన చేపడుతున్న పథకాలు, రాష్ట్ర పురోగతికి చేస్తున్న ఆలోచనలు దేశంలోని ఇతర పాలకులకు అనుసరణీయమని కేటీఆర్ సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఎ ముజీబ్ స్పష్టం చేశారు. త్వరలోనే అందనున్న దళితబంధు పథకంతో దళితుల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వెలుగులు విరజిమ్ముతాయని, అలాగే ఆ కుటుంబాల్లోని పిల్లల జీవితాలు కూడా మెరుగ్గా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం పీర్జాదిగూడలోని తన కార్యాలయంలో ముజీబ్ మాట్లాడారు. ఇప్పటికే అన్నదాతలకు అన్నివిధా లుగా తోడుగా నిలిచి, పంట గింజలు ఇంటికి చేరేదాకా వ్యవసాయరంగానికి ఊపిరిలూదిన కర్షక బాంధవుడు కేసీఆర్ అని కొని యాడారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయడం ఎవరూ ఊహించలేనిదని, ఎన్నికల హామీనే అని విమర్శించిన వారికి సీిఎం కేసీఆర్ నిర్ణయం చెంప పెట్టులాంటిదన్నారు. ఉద్యోగులు, విద్యా ర్థులు అనే తేడాలేకుండా అన్ని రంగాలూ, అన్నివర్గాల ప్రజల పురోగతి కోసం ప్రణాళికలు చేస్తున్న తెలంగాణాను మరింత ముందుకు తీసుకువెళ్తున్నాయని చెప్పారు. మన ఊరు - మన బడి అనే కార్యక్రమానికి 7289 కోట్ల రూపాయలు కేటాయించి, 26వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారని, దీంతో సర్కారు బడులు బలోపేతం అవుతా యని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో పేద పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవ, నాయకత్వ పటిమతో తెలంగాణ రాష్ట్రం మున్ముందు ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తుం దని అన్నారు. బంగారు తెలంగాణలో అందరూ భాగస్వా మ్యం కావాలని ఈ సందర్భంగా ఎంఎ ముజీబ్ కోరారు.