Authorization
Wed March 19, 2025 01:49:04 pm
నవతెలంగాణ - హస్తినపురం
తెలంగాణా రాష్ట్ర సీపీఐ(ఎం) 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ హస్తినపురం డివిజన్లోని భుపేష్ గుప్తానగర్, నందనవనంలో స్థానిక సీపీఐ(ఎం) నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న నేపథ్యంలో ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నా యని వారు అన్నారు. ప్రజా సమస్యలను చర్చించి రాబోయే రోజుల్లో ప్రజల తరపున అలుపెరుగని పోరాటాలు సీపీఐ(ఎం) పార్టీ చేస్తుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మంతని యాదయ్య, గడ్డం రవీందర్, కమర్, ఆర్.పాండు నాయక్, దుర్గరావులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.