Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బురాఖాన్ చెరువులో నీటిని బయటకు పంపటాన్ని నిలిపివేయాలని వెంకటాపూర్ గ్రామ ప్రజల ధర్నా
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం, బాలాపూర్ మండలం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపల్లో పరిధిలో ఉన్న వెంకటాపూర్ గ్రామ రెవిన్యూ శివారులో ఉన్న బురాఖాన్ చెరువులోకి గత సంవత్సరం కురిసిన వర్షాలకు చెరువులోకి నీరు భారీగా చేరిందని, చెరువులోని ఎఫ్టిఎల్ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా అనేక ఇండ్లు అక్రమంగా నిర్మాణం చేసినట్లు, చెరువు నీటిలో ఉన్న ఉస్మాన్‌నగర్ కాలనీలోని ఇండ్ల్లలోకి నీరుచేరి ఇండ్లు మునిగాయని మున్సిపల్ అధికారులు చెరువులోని నీటిని పైపుల ద్వారా బయటకు పంపటం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని మాజీ కౌన్సిలర్ దండు గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వెంకటాపూర్ గ్రామ ప్రజలు చెరువులోని నీటిని మున్సిపల్ అధికారులు బయటకు పంపడం ఏమిటని, అందుకు నిరుసనగా చెరువు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ ముదిరాజ్ మాట్లాడుతు పూర్వ కాలంలో ప్రజల సౌకర్యం కోసం నిర్మాణ చేసిన చెరువు ఎఫ్టిఎల్ కొందరు ముస్లిం,మైనార్టిలు ఎలాంటి అనుమతి లేకుండా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారని, చెరువులోని నీటిని తొలగించరాదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. జల్పల్లి మున్సిపల్ అధికారులు కొందరు మైనార్టీ ప్రజా ప్రతినిధుల వత్తిడి మేరకు నీటిని చెరువులో నుండి బయటకు పంపించటం మానుకోవాలన్నారు. చెరువులో ఉన్న నీటిని తొలగిస్తే వెంకటాపూర్, మల్లాపూర్, పలు కాలనీల్లో భూగర్భ జలాలు ఎండిపోయి నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా కురిసిన వర్షాలకు చెరువులోకి నీరుచేరటంతో ఉస్మాన్‌నగర్ కాలనీలో కొన్ని ఇండ్లు నీటిలో మునిగి కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయాని గుర్తించిన జల్పల్లి మున్సిపల్ అధికారులు నీటిని పైపుల ద్వారా తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు చెరువులోని నీటిని యదావిధిగా బయటకు పంపిస్తే తిరిగి కోర్టును అశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ విషయాని రాష్ట్ర విద్యా శాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి దష్టికి తీసుకుపోయి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడారి ఐలయ్య యాదవ్, రమేష్, శ్రీశైలం, సురేష్, కుక్కల నరేందర్, కర్ర దశరథ, నాగేష్, కుక్కల శ్రీనివాస్, యాదయ్య, మహేందర్, నవీన్ యాదవ్, కుమార్, వీరేష్, దుర్గాప్రసాద్, నవీన్, పూల మల్లేష్, భారీ ఎత్తున గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.