Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తిరుమలగిరికి చెందిన ఎస్సీ మహిళలకు ఆయిల్ తయారు చేసే మిషన్లను టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల ఎంఎల్ఆర్ఐటీ సహకారంతో తయారు చేసిన వివిధరకాల ఉపకరణాలైన కొబ్బరి, పల్లి నూనె తయారీ యంత్రాలను వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధికి అవసరమైన జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు భాగ్యశ్రీ, శ్యామ్ కుమార్, తదితరుల పాల్గొన్నారు.