Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్‌నగర్ డివిజన్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రాలు, కమిటీ హాల్స్ కోసం వినాయక్ నగర్ డివిజన్లో ఉన్న ప్రభుత్వ భూములను కేటాయించాలని డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి, మల్కాజిగిరి డివిజన్ ఆర్డీఓ మల్లయ్య తహస ీల్దార్ వినరు లతను కలిసి వినతి పత్రం ఇవ్వడం అందజే శారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వినాయక్‌నగర్ డివిజన్ లో ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాలే నివాసం ఉంటున్నాయనీ, వినాయక్‌నగర్ డివిజన్‌కు సంబంధించిన రెండు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఉన్నాయన్నారు. ఇవి ఒకటి ఓల్డ్ సఫీల్ గూడ, మరొకటి నేరెడ్ మెట్లో ఉండటం వల్ల వినాయక్‌నగర్ డివిజన్ ప్రజలకు అందుబాటులోలేకపోవడంతో ఇబ్బందు లు పడుతున్నారని తెలిపారు. డివిజన్‌లోనే ప్రభుత్వ భూమి కేటాయిస్తే అక్కడే అన్ని నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఓం ప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఆర్.మణిరత్నం, ఉపాధ్యక్షులు సాయి సురేష్, సాయిరామ్ పాల్గొన్నారు.