Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందనీ, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అన్నారు. కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హను మంతరావు సూచనల మేరకు గౌతంనగర్ డివిజన్ పరిధి లోని వీణాపాణి నగర్లో జరుగుతున్న ఫీవర్ సర్వేను కార్పొరేటర్ మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ రాజు సోమ వారం వైద్యాధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనీ, స్వల్ప జాగ్రత్తలు తీసుకు ంటే ఏ రోగాలూ ధరి చేరవన్నారు. ఇంట్లో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నాయా అని తెలుసుకు ని లక్షణాలున్న వారికి హౌమ్ ఐసోలేషన్ కిట్లు అందజ ేశారు. కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, అత్యవస రమైతేనే బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాము యాదవ్, సీఓ వెంకన్న, సూపర్ వైజర్ మాధవి, ఆర్పీలు విద్య, స్వప్న, ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు.