Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బస్తీలు, కాలనీల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేం దుకు శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో మళ్లీ సోడియం ద్రావణాన్ని స్ప్రే చేశారు. తన సొంత నిధులతో వాహనాలను ఏర్పాటు చేసి ద్రావణాన్ని పిచికారీ చేయించారు.అందులో భాగంగా వార్డుల పరిధిలోని ఒకటో వార్డు చిన్న తోకట, సంజీవయ్య నగర్ కాలనీ, న్యూ బోయిన్పల్లి బస్తీల్లో పిచుకారీ చేయిం చారు. గతేడాది సైతం కరోనా ప్రభావం దృష్ట్యా కంటో న్మెంట్ నియోజకవర్గంలోని అని వార్డులు, బస్తీలు, అపార్ట్మె ంట్లు, కరోనా ప్రభావం ఉన్న ప్రతి చోటా శానిటైజ్ చేయిం చారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అశోక్, చిన్న తోకట ప్రెసిడెంట్, గణేష్, చోటు, జగదీష్, నాని, చరణ్, ప్రకాష్, హరికృష్ణ, శ్రీగణేష్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.