Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
జన విజ్ఞాన వేదిక కాప్రా మండల కమిటీ ఆధ్వర్యంలో కుషాయిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పోస్టర్ను ఉపాధ్యా యులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చేతుల మీదగా సోమవారం ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బాలికల పట్ల కొనసాగుతున్న వివక్షతను తొలగించి, అన్ని రంగాల్లో వారి అభివద్దే లక్ష్యంగా ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటాం అన్నారు. ఇదే రోజు ఇందిరా గాంధీ భారత మొదటి మహిళా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారనీ, మన దేశంలో మహిళా సాధికారతకు ఇది చిహ్నంగా తీసుకున్నారన్నారు. 2008 లో మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ తీసుకున్న చొరవ కారణంగా 2009 నుంచి ప్రతి ఏడాది జాతీయ బాలికల దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం, భారతదేశ బాలికలకు అండగా ఉంటామని చెప్పడమే గాక, అవకాశాలను అందించడం, ఆడ పిల్లలకు గల హక్కుల గురించి అవగాహన కల్పించడం, బాలిక విద్యా ప్రాముఖ్యత, వారి ఆరోగ్యం, పోషణపై అవగాహన పెంచడం వంటివి ఉన్నాయన్నారు. ఆడపిల్ల అని తెలిసి భ్రూణ హత్య (పిండాన్ని తొలగించడం), లింగ అసమానత (వివక్ష), లైంగిక వేధింపుల వంటి సమస్యలను తొలగించ డం, బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలను ఎత్తిచూ పడం, దీని వెనక ఉన్న ప్రధాన లక్ష్యాలు అన్నారు. తల్లి గర్భంలో నలుసుగా పడింది, మొదలు మన దేశంలో ఆడబిడ్డ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావనీ, ఈ రోజుల్లో కూడా భ్రూణ హత్య దశను దాటి భూమిపై పడింది మొదలు... ఆడపిల్ల అడుగడుగునా వివక్షత ఎదుర్కొంటున్న తీరు అత్యంత బాధాకరం అన్నారు. దీనికి సమాజ మూలాల్లో స్థిరపడ్డ పురుషస్వామ్య సంస్కతి ఒక కారణం అయితే, అడవారికి ఆడవాళ్లే శత్రువులు అన్న రీతిలో ఇతర ఆడవాళ్లు కొంత వరకు కారణం అవుతున్నార న్నారు. ఈ విషయంపై సామాజిక అవగాహన పెంచి పీడన నుంచి బాలికలకు విముక్తి కలిగించేందుకు ప్రభు త్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కుషాయి గూడ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారెడ్డి, ఉపాధ్యాయులు రజిత, సుమతి, సుమలత, నిర్మల, స్వప్న, జన విజ్ఞాన వేదిక నాయకులు నాగరాజు, నరసింహ, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.