Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. విజయవాడలోని భవానీ ఐస్ ల్యాండ్‌లో జరిగిన నేషనల్ సమావేశంలో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సిద్ధేశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గాడం లలిత, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా రామకృష్ణ ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన సభ్యులకు నేషనల్ చైర్మెన్ పైడి అంకయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జలగం పన్వీ నియామక పత్రాలు, గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం పైడి అంకయ్య మాట్లాడుతూ ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో తాము, తమ కౌన్సిల్ సభ్యులు అక్కడ ఉంటామన్నారు. అనునిత్యం ప్రసార మాద్యమాల్లో ఎన్నో విధాలుగా మానవ హక్కుల ఉల్లంగణలు జరుగుతుండటం చూస్తున్నామనీ, అలాంటి సందర్బాల్లో తాము మీకు అండగా ఉంటామన్నారు. నేషనల్ వైస్ చైర్మెన్ ఉత్తరాది హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ సంస్థను జాతీయ స్థాయిలో విస్తరించడానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గతంలోనూ మానవ హక్కుల ఉల్లంఘన విషయాల్లో ఎన్నో కేసులను న్యాయ సేవా ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పరిష్క రించామని తెలిపారు. ప్రతి పౌరుడూ చట్టం గురించి తెలుసుకుంటేనే ప్రతి ఒక్కరూ ప్రశ్నించగలుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ మిత్రులందరూ కలిసి నేషనల్ హ్యూ మన్ రైట్స్ కౌన్సిల్ అనే జాతీయ స్థాయి సంస్థను నెలకొ ల్పడం శుభపరిణామం అన్నారు. ప్రారంభించిన అనతి కాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఇంటర్నేషనల్ అంబాసిర్ హ్యూమన్ రైట్స్ అండ్ పీస్ సంస్థలో ఉన్న తనకు ఎన్నో సంస్థలు మానవ హక్కుల పేరుతో సరైన పత్రాల్లేకుండా మానవ హక్కులనే ఉల్లంఘిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందనీ, ఇలాంటి సంఘాలను ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మానవ హక్కుల ఉల్లంఘణ జరిగినప్పుడు ఎలా ఫిర్యాదు చేయాలో తెలియ జేస్తూ ఎవరి సంస్థ పట్ల వారికి గౌరవాభిమానం ఉంటు ందనీ, ఇతర సంస్థలను తక్కువ చేయడం సరికాదన్నారు. నేషనల్ మీడియా కో-ఆర్డినేటర్ మాచర్ల హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ ఐటెంటిటీ కార్డును పార్మాల్టీ కోసం కాకుండా ఒక ఫార్మర్ లాగ ముందుకు తీసుకెళ్లాలని సూచి ంచారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ సంస్థ దృష్టికి తీసుకొచ్చే సామరస్యంగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేషనల్ సెక్రెటరీ మంగళపు ప్రకాష్, ఆంధ్రపదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ కుమార్, ఉపాధ్యక్షులు అంజి, ప్రధాన కార్యదర్శి వినరుకుమార్, మహిళా అధ్యక్షురాలు రహీదా బేగం, రెండు రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.