Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
రాష్ట్రంలో అర్హత గల పేదలు, వ్యవసాయ కార్మికులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలనీ, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ హెచ్చరించారు. సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మల్కాజిగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర వ్యాప్త ధర్నా పిలుపులో భాగంగా నిర్వహించిన ధర్నాలో ఎన్.బాలమల్లేష్ మాట్లా డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హత గల పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి ఏడేండ్లు గడుస్తున్నా ఇంత వరకు ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో దాదాపు 22 లక్షలకు పైగా ఇండ్లు లేని పేదలు ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబు తున్నా నేటికీ ఇండ్లు ఇవ్వకపోవడంతో పేద వారు ఆందో ళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉపాధి లేక నగరానికి వలసలు వస్తు న్నారనీ, ఇక్కడ కిరాయి ఇండ్లలో ఉండి డబ్బులు చెల్లించ లేక అనేక అవస్తలు పడుతున్నారని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ చట్టంలో ఏడాదికి 200 రోజులు పనులు కల్పించాలనీ, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా చూసి పేదలకు భూములు పంచాలని డిమాండ్ చేశారు. అనంతరం మల్కాజిగిరి మండల తహసీల్దార్ వినయ లతకు మెమోరండం అందజేశారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి, మల్కాజిగిరి మండల కార్యదర్శి టి.యాదయ్య గౌడ్, సహాయ కార్యదర్శి కె.అశోక్, అల్వాల్ మండల కార్యదర్శి కె.సహదేవ్, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షులు వెంకటచారి, సహాయ కార్యదర్శులు జంగయ్య, సల్మాన్ బెగ్, మల్కాజిగిరి మండల సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి.చంద్రయ్య, అర్.వెంకటేష్, ప్రభాకరరావు, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల నాగరాజు, జ్.వెంకట రమణ, రఫిక, లింగం, జి.రాములు, అజీజ్, ఇమ్రాన్, టి.సాయిగౌడ్, అలివేలు, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.