Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలు కల్పనకు ఎంతో కృషి చేస్తోందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహ్మారెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ లోని స్వామినారాయణ కాలనీలో డ్రయినేజీ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ గడ్డం లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్య ఇస్తుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశంతో కార్పొరేషన్లో కోట్లాది రూపాయలతో అనేక అభివద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దడిగ శంకర్, ఏఈఈ రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.