Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్ అన్నారు. మార్చులో దళిత బంధు పథకం లభ్దిదారుల ఖాతాలో జమ చేయడానికి సిద్దంఅయిన సందర్భంగా సోమవారం డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ హుజూరాబాద్‌లో ప్రకటించినటువంటి ప్రతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక్కో యూనిట్లో 100 మంది దళిత లభ్దిదారులకు దళిత బంధు పథకం ద్వారా రూ.10 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలో చేరుతాయని చెప్పారన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఐలయ్య, బి.నర్సింహా, సతీష్‌కుమార్, యాదగిరి, సత్యనారాయణ, తులసీరామ్, సీఎమ్ నర్సింహా, రవీందర్‌రెడ్డి, మల్లేష్, శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి, సీనియర్‌నాయకులు ఇస్మాయిల్, లక్ష్మీ, గీత, సుజాత, అఖిల, స్వాతి, సునీత, మాళవిక, అనురాధ, వీణకుమారి, వరలక్ష్మీ, పల్లవి, అక్షిత తదితరులు పాల్గొన్నారు.