Authorization
Wed March 19, 2025 03:33:35 am
నవతెలంగాణ-బాలానగర్
నేటి యువత ఆసక్తి గల క్రీడల్లో రాణించి అంచెలంచెలుగా ఎదగాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ యూత్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉత్సాహానికి, దేహ దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయని, తలిదండ్రులు చదువుతో పాటు తమ పిల్లలను ఆసక్తి గల క్రీడలలోరాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రధానంగా కరోనా కష్ట కాలంలోనూ ప్రతి రోజూ జాగ్రత్తలు తీసుకుంటూ సాధన చేసి జాతీయ స్థాయికి చేరుకోవాలని కోరారు.