Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ అభివృద్ధి కోసం మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ. 1 కోటి మంజూరు చేశారని బాలానగర్ డివిజన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆర్. మధు గౌడ్ గుర్తు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ ఇంద్రానగర్ వాసులకు అండగా నిలబడి మంజీరా పైప్ లైన్ను మంజూరు చేశారన్నారు. గతేడాది రేవంత్ రెడ్డి మంజూరు చేసిన కోటి రూపాయల నిధులు నేటికీ కార్యరూపం దాల్చటానికి సుమారు ఏడాది కాలం పట్టిందన్నారు. అభివద్ధి పనులకు పలు ఆటంకాలు ఎదురైనా తానున్నానంటూ ముందుకు ఇచ్చి సంబంధిత అధికారులతో మాట్లాడి ఎట్టకేలకు భూగర్భ డ్రయినేజీ పనులు పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి కషి చేయడం గర్వపడుతున్నామని తెలిపారు. అలాగే సీసీ రోడ్లు, విద్యుత్ స్తంభాల కోసం రెండో విడత నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైలారం కుర్మయ్య, ఎస్. బక్కయ్య, వెంకటేష్ గౌడ్, రాము, పారశురాం, మధు, పగిడిపల్లి రాము, ఇమ్రాన్, యుగంధర్, వి. శ్రీకాంత్, స్థానికులు పాల్గొన్నారు.