Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
కరోనా కష్టకాలంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ లను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దవూరే బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులపై విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులను దష్టిలో ఉంచుకుని కార్పొరేట్ విద్యా సంస్థలకు ఫీజుల వసూలు చేయకూడదని కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని గుర్తుచేశారు. ఇదంతా పెడచెవిన పెడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలు 100% ఫీజులు వసూలు చేస్తూ పేద తల్లిదండ్రులకు గుదిబండలా మారయి అన్నారు. మొత్తం ఫీజు కడితే గాని హాల్ టికెట్లు ఇవ్వమని బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాఠశాలలు పునః ప్రారంభించాలని అదేవిధంగా స్కూల్ లలో కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠాలు బోధించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసి ఫీజు దోపిడీలకు పాల్పడుతున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో చెరుకు ఉమేష్ గౌడ్, కె అంజి, కె లింగరాజ్, సాయి యాదవ్, అశోక్ యాదవ్, ప్రవీణ్, కార్తీక్‌రెడ్డి, వినరు, అరవింద్
తదితరులు పాల్గొన్నారు.