Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
భోజన ప్రియులకు నాణ్యమైన రుచులతో ఫుడ్ అందించాలని రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. దిల్సుఖ్ నగర్, గడ్డిఅన్నారంలో నూతనంగా ఏర్పాటు చేసిన మి మండి ఎలైట్ అరేబియన్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుచి, శుభ్రతతో రుచికరమైన వంటకాలను భోజన ప్రియులకు అందించి మరింత అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. తక్కువ ధరలతో కస్టమర్లకు నాణ్యమైన వంటకాలను అందించేందుకు ముందుకు వచ్చిన యాజమాన్యాన్ని అభినందించారు. తదనంతరం నిర్వాహకులు ముఖ్య అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శివ, సుమంత్, రాజు, వంశీ, నాయకులు వేణు గోపాల్ గౌడ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.