Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ నియోజకవర్గంలో నాలాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం తార్నాక డివిజన్ పరిధిలో శాంతి నగర్, లక్ష్మి నగర్ ప్రాంతాల్లో రూ. 2.39 కోట్లతో రెండు నాలాల అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 దశాబ్దాల్లో చేపట్టని పనులను కేవలం ఐదేండ్లలో కాలంలో చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే పనుల్లో నాణ్యతను పాటించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీ మోహన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, టీఆర్ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, నాయకులు సునీల్ ముదిరాజ్, వేణు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాగేశ్వరరావు, బలరాం, కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.
కోవిడ్ నిబంధనలు బేఖాతర్
నగరంలో నిత్యం వేలాది కరోనా, ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నా ఈ సమయంలో ప్రజాప్రతినిధులు కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. గుంపులు గుంపులు ఉన్న కూడా మాస్క్‌లు ధరించక పోవడంతో పాటుగా, కనీసం సామాజిక దూరం పాటించకపోవడం శోచనీయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ఇలా చేయడం వల్లనే కేసులు రెట్టింపు సంఖ్యలో పెరుగుతున్నాయని అని కొందరు అభిప్రాయం వ్యక్తంచేశారు.