Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానికి ప్రత్యేక గుర్తింపు ఉందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా అన్నారు. సోమవారం ఓ ప్రముఖ హోటల్లో అమ్నిఫుడ్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ అందుబాటులోకి తెచ్చిన మసాల ఉత్పత్తులను అంబర్ పేట ఎమ్మెల్యే ఆలేరు వెంకటేశ్‌తో కలిసి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హైదరాబాద్‌కు వచ్చారంటే తప్పకుండా బిర్యానీ రుచి చూడకుండా వెళ్లరని తెలిపారు. హైదరాబాద్ బిర్యానీ ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో నవీన్ బందం హైదరాబాద్ పక్వాని అథెంటెక్ మాసాలను మార్కెట్లో తీసుకురావడం శుభసూచకంగా అని పేర్కొన్నారు. మసాలా ఉత్పత్తుల ప్రచారకర్త యాంకర్ రవి, సంస్థ ఎండీ నవీన్ పాల్గొన్నారు.